- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీల వడ్డీ రేట్లను సవరించామని, ఇవి మార్చి 17 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ప్రత్యేక 399 రోజుల ఎఫ్‌డీపై సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. ఇక, 7-45 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై బ్యాంకు 3 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
90-180 రోజుల డిపాజిట్లకు 4.50 శాతం, 181-210 రోజులకు 5.25 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై 5.75 శాతం, 1-3 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 6.75 శాతం, 3-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీని బ్యాంకు ఇస్తోంది. ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలైన 444, 555 రోజుల కాలవ్యవధి ఉన్న బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది.






