BOB: మహిళా ఎన్నారైల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన బీఓబీ

by S Gopi |

గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ సేవింగ్స్ ఖాతా ద్వారా మహిళా ఎన్నారైలు గృహ, వాహన రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను పొందనున్నారు

BOB: మహిళా ఎన్నారైల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన బీఓబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) మహిళా ఎన్నారైల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న మొదటి భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ సేవింగ్స్ ఖాతా ద్వారా మహిళా ఎన్నారైలు గృహ, వాహన రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను పొందనున్నారు. తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, లాకర్ అద్దెపై పూర్తి మినహాయింపు లభిస్తుంది. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌, ఇతర ప్రయోజనాలతో కూడిన డెబిట్ కార్డు ఇవ్వనుంది. అంతేకాకుండా ఉచిత పర్సనల్, విమాన ప్రమాద బీమా కవరేజీ సదుపాయం కూడా బ్యాంకు అందోస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మహిళల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా 17 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దాదాపు 16.5 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తోంది. గ్లోబల్ ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ విభాగంలో మరింత సమర్థవంతమైన సేవలందించేందుకు బ్యాంకు కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది.

Next Story