- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: మూడు రెట్లు పెరిగిన బ్యాంకు మోసాలు
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ విలువైన మోసాలు జరిగినట్టు..

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు గణనీయంగా తగ్గాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా నివేదికలో తెలిపింది. అయితే, మోసాలకు సంబంధించీ నగదు విలువ మాత్రం 3 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. జరిగిన మోసాల్లో చాలా కేసులు డిజిటల్ చెల్లింపుల విధానంలో జరిగాయని ఆర్‌బీఐ గురువారం ప్రకటనలో తెలిపింది. వాటిలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ విలువైన మోసాలు జరిగినట్టు వెల్లడించింది. గత మూడేళ్ల గణాంకాలను చూసిన కూడా సంఖ్యా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎక్కువ నమోదవగా, విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అత్యధికం జరిగాయి. విలువ పరంగా మొత్తం మోసాల్లో 71 శాతం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2024-25లో మొత్తం 23,953 బ్యాంకు మోసాలు జరగ్గా, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 34 శాతం తగ్గింది. ఈ బ్యాంకు మోసాల విలువ రూ. 36,014 కోట్లతో మూడు రెట్లు పెరిగింది.
లోన్ మోసాలే అత్యధికం
అన్ని బ్యాంకు మోసాల్లో కేవలం లోన్‌కు సంబంధించిన మోసాలు 230 శాతం పెరిగి రూ.33,148 కోట్లకు చేరుకున్నాయి. లోన్ మోసాల కేసుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు పెరుగుదలతో 7,950కి చేరుకున్నాయి. కార్డ్, ఇంటర్నెట్ మోసాలు విలువ పరంగా 63 శాతం తగ్గి రూ.520 కోట్లుగా ఉన్నాయి. అయితే సంఖ్యా పరంగా సగానికి పైగా తగ్గి 13,516కి చేరుకున్నాయి.






