- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన ధర
నాలుగైదు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన పసిడి (Gold) ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.1,960 పెరిగింది. దీంతో ప్రస్తుతం ధర రూ.1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ధర రూ.1,800 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది.
అదేవిధంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి (Silver) ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర నిన్నటి స్థాయిలోనే రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటం, ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.






