Axis Bank: తొలి డిజిటల్ లాకర్-ఫోకస్డ్ బ్రాంచ్ ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్

by S Gopi |

దేశంలో డిమాండ్ కారణంగా సేఫ్-డిపాజిట్ లాకర్ల అవసరం ఎక్కువైంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ తన డిజిటల్ లాకర్-ఫోకస్డ్ బ్రాంచులతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.

Axis Bank: తొలి డిజిటల్ లాకర్-ఫోకస్డ్ బ్రాంచ్ ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ శనివారం తన తొలి డిజిటల్ లాకర్-ఫోకస్డ్ బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీ, ఆటోమేషన్, భద్రతా ప్రమాణాలతో వినియోగదారులకు కొత్త తరహా బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడమే ఈ బ్రాంచ్ లక్ష్యమని బ్యాంకు తెలిపింది. దేశంలో డిమాండ్ కారణంగా సేఫ్-డిపాజిట్ లాకర్ల అవసరం ఎక్కువైంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ తన డిజిటల్ లాకర్-ఫోకస్డ్ బ్రాంచులతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఏరియాల్లో కాంపాక్ట్ ఫార్మాట్‌లో ఏర్పాటుచేసిన ఈ బ్రాంచ్‌లు, వినియోగదారులకు చేరువలో ఉంటాయి. టెక్నాలజీ ఆధారిత సేవల ద్వారా మారుతున్న అవసరాలను ఇవి తీరుస్తాయని బ్యాంకు చెబుతోంది. ఈ బ్రాంచ్‌లలో భద్రతా ఏర్పాట్లు చాలా ఆధునికంగా ఉంటాయి. లాకర్లు ఉండే వాల్ట్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా నిరంతర నిఘా, ముఖ్యంగా కస్టమర్లకు 24 గంటల యాక్సెస్ ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ బ్రాంచ్‌లో రోబోటిక్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. లాకర్‌ను యాక్సెస్ చేసినప్పుడు, ఆ సిస్టమ్ లాకర్‌ను నేరుగా ప్రైవేట్ లాంజ్‌లోకి తీసుకువస్తుంది. అలాగే, ఫిజికల్ కీ అవసరం లేకుండా బయోమెట్రిక్, మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఉంటుందని బ్యాంకు వెల్లడించింది.

Next Story