Inflation: ఆగష్టులో స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా నమోదైంది.

Inflation: ఆగష్టులో స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం విడుదల చేసిన గణాంకా, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 1.61 శాతంగా ఉంది. గతేడాది ఆగష్టులో 3.65 శాతంగా ఉంది. అయితే, ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం పరిధిలోనే ఉంది. సమీక్షించిన నెలలో అధిక ద్రవ్యోల్బణానికి ప్రధానంగా కూరగాయలు, మాంసం, చేపల ధరలు పెరగడమే కారణం. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం -0.69 శాతంగా ఉంది. అంతకుముందు జూలైతో పోలిస్తే ఇది 107 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇదే సమయంలో గ్రామీణ ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతం నుంచి 1.69 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.47 శాతానికి పెరిగింది, అంతకుముందు జూలైలో ఇది 2.10 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో స్వల్పంగా మెరుగుపడి ఆగస్టులో -0.70 శాతానికి చేరుకుంది. అంతకుముందు జూలైలో ఇది -1.74 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఆగస్టులో -0.58 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఆగష్టులో కూరగాయల ధరలు 15.92 శాతం తగ్గాయి. గత నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ఆహార ధరలు పెరిగాయి. సెప్టెంబర్లోనూ అవే పరిస్థితులు ఉంటాయనే అంచనాల మధ్య వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాల వంటి పంటలు దెబ్బతినవచ్చు.

Next Story