Audi India: ధరలను పెంచిన ఆడి ఇండియా

by S Gopi |

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.

Audi India: ధరలను పెంచిన ఆడి ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పాక్షికంగానైనా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు విధానం కారు మోడల్, వేరియంట్‌ను వేర్వేరుగా ఉంటుందని, కార్ల ఎక్స్-షోరూమ్ ధరలపై ఈ పెంపు అమలవుతుందని ఆడి ఇండియా డైరెక్టర్ బల్బీర్ సింగ్ దిల్లో స్పష్టం చేశారు. ఇప్పటికీ కస్టమర్లపై ఖర్చుల భారం తగ్గించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.

Next Story