- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Audi India: జీఎస్టీ ఎఫెక్ట్.. కార్లపై రూ.7.8 లక్షల వరకు తగ్గించిన ఆడి ఇండియా
ఈ తగ్గింపు వాహన మోడల్, వేరియంట్ బట్టి రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షల వరకు ఉండనుందని కంపెనీ తెలిపింది

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్రం చేసిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణల నేపథ్యంలో ఇప్పటికే పలు కార్ల తయారీ కంపెనీలు ధరల తగ్గింపుపై ప్రకటనలు విడుదల చేశాయి. తాజాగా ప్రీమియం కార్ల బ్రాండ్ ఆడి ఇండియా కూడా జీఎస్టీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ తగ్గింపు వాహన మోడల్, వేరియంట్ బట్టి రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షల వరకు ఉండనుందని కంపెనీ తెలిపింది. కొత్త ధరల ప్రకారం.. ఎంట్రీ-లెవల్ ఆడి క్యు3 ఇప్పుడు రూ.43.07 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, ఈ కారుపై రూ. 3 లక్షలకు పైగా తగ్గింపు అమలు చేసింది. మిడ్-సైజ్ క్యూ5 ధర రూ.4.55 లక్షల తక్కువతో రూ.63.75 లక్షలకు లభిస్తుంది. ఎస్‌యూవీ మోడల్ క్యూ7 ధర రూ.6.15 లక్షలు తగ్గి, రూ.86.14 లక్షలకు చేరుకుంది. ఫ్లాగ్‌షిప్ క్యూ8 ధర రూ.7.8 లక్షల తక్కువతో ఇప్పుడు రూ.1.09 కోట్లకు అందుబాటులో ఉంది. సెడాన్ మోడల్స్ కూడా ఏ4 ధర రూ.46.25 లక్షలకే లభిస్తుంది. గతంలో కంటే ఇది రూ. 2.64 లక్షలు తగ్గింది. ఏ6 ధర రూ.67.38 లక్షలకు లభిస్తుంది. జీఎస్టీ సంస్కరణలకు తోడు పండుగ సీజన్ కారణంగా వాహన పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుందని ఆడి ఇండియా భావిస్తోంది. మరో కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా కూడా తన కొత్త మాగ్నైట్ ధరలను రూ. లక్ష వరకు తగ్గించామని వెల్లడించింది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.






