- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏథర్ నుంచి మరో బైక్.. 159 కి.మీ మైలేజ్!
మార్కెట్లోకి రకరకాల టూ వీలర్ వెహికల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో... ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి రకరకాల టూ వీలర్ వెహికల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో... ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరిగింది. అటు మార్కెట్లోకి వచ్చిన రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలను... జనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక కస్టమర్ల ఆసక్తికి తగ్గట్టుగానే వాహనాలు కూడా మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే... ఏథర్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది.
ఏథర్ నుంచి రిజ్టా ఎస్ ఈవీ స్కూటర్ ను (Ather Rizta ) లాంచ్ చేశారు. ఈ కొత్త బైక్ ధర 1.37 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఈ కొత్త బైక్ 2.9 కెడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 2.9 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర 1.31 లక్షలు గా ఫిక్స్ చేశారు.
అంటే కొత్త బైక్ రిజ్టా ఎస్ ఈవీకి దాదాపు 6 వేల రూపాయలు ఎక్కువగా ఉంది. కొత్తగా లాంచ్ అయిన బైక్ లో 3.7kwh బ్యాటరీ బ్యాక్ ఉంటుంది. ఇక ఈ బైకు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 159 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ బైక్ లో అనేక రకాల ఫీచర్స్ ఉంటాయని కూడా కంపెనీ అధికారులు చెబుతున్నారు.






