Ambani Family: ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఆరుగురు భారతీయులు

by S Gopi |

టాప్-20 సంపన్న కుటుంబాల జాబితాలో ఓ భారతీయ కుటుంబం అగ్రస్థానంలో ఉండటం, మరో ఐదుగురు ర్యాంకులు సాధించడం ఇందుకు నిదర్శనం.

Ambani Family: ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఆరుగురు భారతీయులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయులు సొంత నైపుణ్యాలతోనే కాకుండా వ్యాపార విధానాలతోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందుతున్నారు. తాజాగా బ్లూమ్‌బర్గ్ ఆసియాలోని టాప్-20 సంపన్న కుటుంబాల జాబితాలో ఓ భారతీయ కుటుంబం అగ్రస్థానంలో ఉండటం, మరో ఐదుగురు ర్యాంకులు సాధించడం ఇందుకు నిదర్శనం. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ముఖేశ్ అంబానీ కుటుంబం నిలిచింది. దివంగత పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీతో వ్యాపార ప్రయాణం ప్రారంభించిన అంబానీ కుటుంబం సంపద 90.5 బిలియన్ డాలర్లు(రూ. 7.85 లక్షల కోట్లు) అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వీరి తర్వాత థాయ్‌లాండ్‌కు చెందిన చీరవానోంట్ కుటుంబం మొత్తం 42.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3.70 లక్షల కోట్లు) సంపదతో రెండవ స్థానంలో ఉంది. ఇది అంబానీ మొత్తం సంపదలో సగం కంటే తక్కువ. చిరవానోంట్ కుటుంబంలోని నాలుగవ తరం ఆసియా వ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. చారోన్ పోక్‌ఫాండ్ గ్రూప్ ఫుడ్, రిటైల్, టెలికాం వ్యాపారంలో ఉంది. ఇండోనేషియాకు చెందిన హార్టోనో కుటుంబం మొత్తం 42.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.66 లక్షల కోట్లు) సంపదతో మూడవ స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన వారిలో మిస్త్రీ కుటుంబం మొత్తం 37.5 బిలియన్ డాలర్ల (రూ. 3.25 లక్షల కోట్లు) సంపదతో నాలుగవ స్థానంలో, 28.1 బిలియన్‌ డాలర్లు (రూ. 2.44 లక్షల కోట్లు) సంపదతో ఏడో స్థానంలో, 23 బిలియన్‌ డాలర్లు (రూ. 1.99 లక్షల కోట్లు)తో బిర్లా ఫ్యామిలీలు మొదటి పది స్థానాల్లో ఉన్నారు. టాప్-20లో బజాజ్ కుటుంబంతో పాటు హిందూజా కుటుంబం చోటు దక్కించుకుంది.

Next Story