IIP Data: ఎనిమిది నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

by S Gopi |

సమీక్షించిన నెలలో మైనింగ్ రంగం ఉత్పత్తి 0.2 శాతం క్షీణించింది.

IIP Data: ఎనిమిది నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి ఓ మోస్తరు వృద్ధిని నమోదు చేశాయి. అంతకుముందు మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.94 శాతం ఉండగా, గత నెలలో ఎనిమిది నెలల కనిష్టం 2.7 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ సూచీ 5.2 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ బుధవారం గణాంకాలను వెల్లడించింది. ప్రధానంగా మైనింగ్ రంగలో ఉత్పత్తి నెమ్మదించడంతో మొత్తంగా ఐఐటీ డేటా ప్రభావం కనిపించిందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. సమీక్షించిన నెలలో మైనింగ్ రంగం ఉత్పత్తి 0.2 శాతం క్షీణించింది. విద్యుత్ రంగం ఉత్పత్తి కూడా 1.1 శాతం తగ్గింది. అయితే, తయారీ రంగం 3.4 శాతం పుంజుకుంది. మన్నికైన వినియోగ వస్తువుల తయారీ 4 శాతం, సాధారణ ఉత్పత్తుల తయారీ 6.4 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఐఐటీ డేటా ప్రతి నెలా 28వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏదైనా నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాల వెల్లడిని 42 రోజుల నుంచి 28 రోజులకు కుదించింది. ఆ నెల పూర్తయిన 28 రోజుల్లోగా విడుదల చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది

Next Story