- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apple: భారత్‌లో తయారీ కోసం నిధులు సమకూర్చిన ఫాక్స్‌కాన్ మాతృసంస్థ హోన్ హాయ్
ప్రధానంగా దక్షిణ భారత్‌లో హోన్ హాయ్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ట్రంప్ తీరుతో భారత్‌లో యాపిల్ పెట్టుబడులను తగ్గిస్తుందనే ఊహాగానాలు కూడా పెరిగాయి. అయితే, ఈ వ్యవహారం ముగుస్తున్న వేళ తాజాగా యాపిల్ ఐఫోన్‌ల ప్రధాన అసెంబ్లింగ్ కంపెనీ అయిన ఫాక్స్‌కాన్‌కు దాని మాతృసంస్థ హోన్ హాయ్ కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల(రూ. 12.8 వేల కోట్ల) నిధులను అందజేసింది. ఈ మేరకు ఫాక్స్‌కాన్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చినట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఈ పెట్టుబడి కంపెనీ సింగపూర్ ఆధారిత యూనిట్ ద్వారా జరిగింది. ప్రధానంగా దక్షిణ భారత్‌లో హోన్ హాయ్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలుస్తోంది. కొత్త కేంద్రాలను నిర్మించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వంటి వాటికోసం ఖర్చు చేయనున్నారు. ఐఫోన్‌ల తయారీలో ఎక్కువ భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించే యాపిల్ ప్రయత్నాలను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. ఇటీవల యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది చివరి నాటికి అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారత్ నుంచి ఉత్పత్తి అయినవే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. చాలా కాలంగా ఐఫోన్ ఉత్పత్తి కోసం చైనాపై ఆధార పడిన యాపిల్ కంపెనీ, దాన్నుంచి బయటపడాలని భావిస్తోంది. భారత్‌లో విస్తరించడం పాటు అమెరికాలోనూ ఫాక్స్‌కాన్ ఎక్కువ పెట్టుబడులకు సిద్ధంగా ఉంది.






