- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple Macbook: సగం ధరకే లభిస్తున్న యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4
క్రోమా అసలు ధర కంటే చాలా తక్కువగా స్టూడెంట్, టీచర్ ఆఫర్ కింద రూ. 88,911కి అందిస్తున్నది.

దిశ, బిజినెస్ బ్యూరో: యాపిల్ మ్యాక్‌బుక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే.. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ఇప్పటికే పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్లు ఆఫర్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే టాటా యాజమాన్యంలోని క్రోమా స్టోర్ బ్లాక్ ఫ్రైడ్ ఆఫర్లో భాగంగా యాపిల్‌కు చెందిన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4ను ఏకంగా సగం ధరకే విక్రయిస్తోంది. ప్రస్తుతం 13 అంగుళాల ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ధర రూ. 99,900 ఉండగా, డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో కలిపి ఇప్పుడు రూ .55,911కే లభిస్తుంది. క్రోమా అసలు ధర కంటే చాలా తక్కువగా స్టూడెంట్, టీచర్ ఆఫర్ కింద రూ. 88,911కి అందిస్తున్నది. దీనికి అదనంగా రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నది. దీనివల్ల ధర మరింత తగ్గుతుంది. ఇక, మీ వద్ద పాత ల్యాప్‌టాప్ లేదా పీసీని ఎక్స్ఛేంజ్ కింద ఇస్తే ధర మరో రూ. 10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ఎక్స్ఛేంజ్ వాల్యూ కింద మరో రూ. 13,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌లన్నీ కలిపితే, మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ధర రూ. 55,911కి చేరుకుంటుంది. ఇది దేశంలోనే మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యల్ప ధరలలో ఒకటి.
ఈ ల్యాప్‌టాప్ యాపిల్ ఉత్పత్తుల్లోనే అత్యంత సన్నని, తేలికైన అల్యూమినియం బాడీతో లభిస్తున్నది. 13.6 అంగుళాల డిస్‌ప్లే, రోజువారీ పని, మల్టీ టాస్కింగ్, సృజనాత్మక పనులను సులభంగా నిర్వహించే ఎం4 చిప్‌తో ఇది లభిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ పూర్తి ఒకర్ రోజంతా పనిచేయగలదు. ఒక మంచి ల్యాప్‌టాప్, అది కూడా యాపిల్ ఉత్పత్తిని కొనసాలనుకునేవారు, ప్రస్తుతం ఉన్న డివైజ్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకోవాలని భావించే వారికి ఇది సరైన సమయం. క్రోమా నుంచి ఈ బ్లాక్ ఫ్రైడే డీల్ ద్వారా కొనేయొచ్చు.






