Apple: భారత మార్కెట్ కోసం ఆన్‌లైన్ స్టోర్ యాప్‌ను ప్రారంభించిన యాపిల్

by S Gopi |

ప్రధానంగా యాపిల్ ఉత్పత్తులు, సేవల కోసం వినియోగదారులు ఈ యాప్ ద్వారా మరింత మెరుగైన సౌకర్యాలను అందుకుంటారు.

Apple: భారత మార్కెట్ కోసం ఆన్‌లైన్ స్టోర్ యాప్‌ను ప్రారంభించిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ భారత మార్కెట్లో కస్టమర్లను మరింత దగ్గరయ్యేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా యాపిల్ ఉత్పత్తులు, సేవల కోసం వినియోగదారులు ఈ యాప్ ద్వారా మరింత మెరుగైన సౌకర్యాలను అందుకుంటారు. దేశీయ మార్కెట్ల ఐఫోన్‌లతో పాటు యాపిల్ ఉత్పత్తులకు భారీ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో అమ్మకాల్లో వృద్ధిని సాధించడమే కాకుండా చిన్న పట్టణలు, నగరాలకు చేరువయ్యేందుకు ఈ యాప్ దోహదపడుతుందని యాపిల్ రిటైల్ ఆన్‌లైన్ హెడ్ కారెన్ రాస్ముసేన్ చెప్పారు. యాపిల్ స్టోర్ యాప్ ద్వారా కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను షాపింగ్ చేయవచ్చని, ఇబ్బందుల్లేని సౌకర్యాలను పొందవచ్చని ఆమె తెలిపారు. ఈ నిర్ణయంతో యాపిల్ కంపెనీ భారత మార్కెట్లో మరింత వేగంగా విస్తరించాలని భావిస్తోంది.

Next Story