- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apple: భారత్‌లోనే ఐఫోన్‌ల తయారీ
భారత్‌లో పెట్టుబడుల విషయంలో ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లనున్నట్టు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఐఫోన్‌ల తయారీ తనకిష్టం లేదని, అక్కడ విస్తరణ వద్దని టెక్ దిగ్గజం యాపిల్‌కు చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంపైంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ప్రత్యామ్నాయం కోసం యాపిల్ సంస్థ భారత్‌లో ఉత్పత్తిని వేగవంతం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 1.88 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను మనదేశంలోనే అసెంబ్లింగ్ చేయించింది. ఇటీవల అమెరికాలో విక్రయించే అన్ని ఐఫోన్‌లు మేడ్ ఇన్ ఇండియావే ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ప్రకటించారు. అయితే, తాజా ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తయారీకి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ప్రభుత్వ వర్గాలు యాపిల్ ప్రతినిధులతో చర్చించారు. భారత్‌లో పెట్టుబడుల విషయంలో ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లనున్నట్టు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా అనుకున్న ప్రకారమే ముందుకెళ్తుందని పీటీఐకి కూడా చెప్పారు. ఐఫోన్ ఉత్పత్తులకు భారత్ కీలక తయారీ కేంద్రంగా ఉంటుందని చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరించాలనుకోవడం యాపిల్ లాంటి కంపెనీకి గణనీయమైన విలువ ఉంటుంది. భారత్‌ను తయారీ కేంద్రంగా ఎంచుకోవడం యాపిల్‌తో పాటు గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకూ మంచిది. యాపిల్ లాంటి సంస్థ దేశీయ ఉత్పత్తి ద్వారా పోటీతత్వాన్ని చూస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికాలో తయారైతే ధర రూ. 2.50 లక్షలు
ఈ అంశంపై పరిశ్రమ వర్గాలు సైతం ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయాలంటే వారి ధరలు ఏకంగా పెరిగి 3,000 డాలర్లకు చేరుతాయని చెబుతున్నారు. చైనా, భారత్, వియత్నాం కాకుండా అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయాలంటే మూడు రెట్లు పెంచేందుకు సిద్ధమవ్వాలని, అమెరికా ప్రజలు అంత ఖర్చు చేయగలరా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఐఫోన్ ధర సగటున 1,000 డాలర్లుగా ఉంది.
యూఎస్ సరఫరాపై సమీక్ష?
మరోవైపు, అమెరికా-చైనా మధ్య టారిఫ్ ఒప్పందం కారణంగా యాపిల్ భారత్‌లో తయారీని సమీక్షించవచ్చని తెలుస్తోంది. భారత్‌లో ఉత్పత్తిని కొనసాగిస్తూనే, అమెరికాలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్‌ల ప్రణాళికలపై మాత్రమే తాత్కాలికంగా సమీక్షించే అవకాశాలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఒక్క యూఎస్ మార్కెట్ కోసం రూపొందించే ఐఫోన్‌ల విషయంలో మాత్రమే ఈ సమీక్ష జరగనున్నట్టు సరఫరా వర్గాలు చెప్పాయని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్‌లపై స్పష్టం కోసం చూస్తున్నాం. చైనాతో టారిఫ్ విషయంలో అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పులు వచ్చాయి. అమెరికాకు సరఫరా చేసే మెగా ఉత్పత్తిని విస్తరించడంపైనే మాత్రమే కొంత విరామం తీసుకుంటామని సరఫరా వర్గాలు పేర్కొన్నాయి.






