- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple: రికార్డు స్థాయిలో 28 శాతం వాటాను సొంతం చేసుకున్న యాపిల్
దేశవ్యాప్తంగా కస్టమర్లు ఖరీదైన మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నందున మొత్తం మార్కెట్ విలువ చాలా వేగంగా విస్తరిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజా కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, దేశీయ కస్టమర్లు ప్రీమియమైజేషన్‌లో భాగంగా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్లను ఇష్టపడుతున్నారు. దీనివల్ల యాపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విలువ పరంగా 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. అమ్మకాల సంఖ్యలో యాపిల్ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా కస్టమర్లు ఖరీదైన మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నందున మొత్తం మార్కెట్ విలువ చాలా వేగంగా విస్తరిస్తోంది. 2024లో యాపిల్ విలువ వాటా 23 శాతంగా ఉంది. ఆ తర్వాత ఐఫోన్ 16 సిరీస్ విజయవంతం కావడం, వేగంగా అమలు చేసిన ఫైనాన్సింగ్, ట్రేడ్-ఇన్ ఆఫర్లు కంపెనీని దేశంలోనే అత్యధిక వాటా సాధించేందుకు సహకరించాయి. పండుగ సీజన్ సందర్భంగా ఇచ్చిన ప్రమోషన్లు ఆదాయ వృద్ధికి మద్దతిచ్చాయి. దీంతో 2025లో యాపిల్ 28 శాతం వాటాతో విలువ పరంగా మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, గతేడాది దేశంలో అత్యధికంగా రవాణా చేసిన మోడల్‌గా యాపిల్ ఐఫోన్ 16 నిలిచిందని నివేదిక వెల్లడించింది. కాగా, గతేడాది దేశవ్యాప్తంగా ప్రీమియం విభాగం(రూ. 30 వేలకు పై ఖరీదైనవి) అమ్మకాల్లో 11 శాతంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కౌంటర్‌పాయిన్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు.






