Iphone 17: పెరగనున్న ఐఫోన్ 17 సిరీస్ ధరలు

by S Gopi |

ఐఫోన్ 17 సిరీస్‌లో డిజైన్, ఫార్మాట్‌లో కొన్ని మార్పులను దృష్టిలో ఉంచుకునే పెంపు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

Iphone 17: పెరగనున్న ఐఫోన్ 17 సిరీస్ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలను అనుకున్న దానికంటే ఎక్కువ ధరకు మార్కెట్లో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే మెరుగైన కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌లను అందిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అయితే, అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య సవాళ్ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఊహాగానాలకు యాపిల్ చెక్ పెట్టింది. అలాంటిదేమీ లేదని, ఐఫోన్ 17 సిరీస్‌లో డిజైన్, ఫార్మాట్‌లో కొన్ని మార్పులను దృష్టిలో ఉంచుకునే పెంపు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా రీడిజైన్, అల్ట్రాథిన్ ఫామ్ ధరలు పెరిగేందుకు ప్రధాన కారణాలుగా ఉండొచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడిన యాపిల్ సరఫరా విభాగంలోని వారు.. కంపెనీ ఇప్పటికీ తన ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని చైనాలోనే పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇప్పటికీ ఐఫోన్ హై-ఎండ్ మోడళ్ల ఉత్పత్తి చైనాలోనే ఉన్న కారణంగా యూఎస్, చైనా టారిఫ్ సమస్య కంపెనీ ధరలు పెంచేందుకు కారణం కాదని చెప్పారు.

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల భారత్‌లోనే చాలా ఐఫోన్‌ల తయారీ జరుగుతుందని చెప్పారు. భారతీయ ప్లాంట్లు ప్రో మోడళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ నైపుణ్యం సమకూరలేదని, ఈ కారణంగానే ప్రో మోడళ్ల తయారీ చైనాలో కొనసాగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరలను పెంచడం వల్ల యాపిల్ తయారీలో అవుతున్న అధిక ఖర్చులను తగ్గించవచ్చని యాపిల్ భావిస్తోంది. ఎందుకంటే, ప్రపంచ సరఫరాలో నెలకొన్న అవాంతరాల వల్ల కంపెనీ ఉత్పత్తిని భారత్‌కు మార్చేందుకు ఈ పెంపు ద్వారా సాధ్యపడుతుందని యాపిల్ ఆశిస్తోంది. యాపిల్ అంచనాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఖర్చులు 900 మిలియన్ డాలర్లు పెరగనున్నాయి. కాగా, యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి లీకులు, ఊహాగానాలు మొదలయ్యాయి.

Next Story