- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాపిల్‌లో #LayOffs కలకలం.. ఆ ఉద్యోగులందరికీ ఉద్వాసన
అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతున్న వేళ..

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతున్న వేళ.. ప్రపంచ టెక్ దిగ్గజమైన యాపిల్ సంస్థలో కూడా ఉద్యోగులను తొలగించడం కలకలం రేపుతోంది. కంపెనీకి రికార్డు స్థాయిలో ఆదాయం ఉన్నా.. ఎంప్లాయిస్ కు లే ఆఫ్ కార్డు చూపడం చర్చనీయాంశంగా మారింది. లే ఆఫ్ కు గురైన వారిలో 20-30 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉన్న పలువురు సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ కంపెనీ తన గ్లోబల్ సేల్స్ ఆపరేషన్లలో డజన్ల మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.
లే ఆఫ్స్ తీసుకున్న వారిలో కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పనిచేసే సెల్స్ టీమ్స్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉన్నారు. కొత్త కస్టమర్లకు యాపిల్ ఉత్పత్తుల డెమోలు చూపించే బ్రీఫింగ్ సెంటర్ల సిబ్బందిని కూడా తొలగించింది. కానీ.. మొత్తం ఎంతమంది ఉద్యోగులకు యాపిల్ సంస్థ ఉద్వాసన పలికిందన్న దానిపై స్పష్టత లేదు. లే ఆఫ్స్ అందుకున్న వారు వచ్చే ఏడాది జనవరి 20లోగా కంపెనీలో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం రానిపక్షంలో సెవరెన్స్ తో పాటు విధుల నుంచి తొలగిస్తారు. 140 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్న యాపిల్ కంపెనీ సైతం లే ఆఫ్స్ ప్రకటించడం.. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.






