Apple: యాపిల్ భారత్‌ను వదిలి వెళ్లడం లేదు.. టిమ్ కుక్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

భారత్‌లో యాపిల్ కంపెనీ (Apple Companies)లు పెట్టాల్సిన అవసరం లేదని.. అమెరికా (America)లోనే పెట్టాలంటూ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (President Donald Trump) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి.

Apple: యాపిల్ భారత్‌ను వదిలి వెళ్లడం లేదు.. టిమ్ కుక్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో యాపిల్ కంపెనీ (Apple Companies)లు పెట్టాల్సిన అవసరం లేదని.. అమెరికా (America)లోనే పెట్టాలంటూ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (President Donald Trump) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. ఖతార్ పర్యటనలో భాగంగా యాపిల్ సీఈవో టిక్ కుక్‌ (Tik Cook)తో భేటీలో ఆయన మాట్లాడుతూ.. భారత్ (India) అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటని అన్నారు. అక్కడ అమెరికా ప్రాడక్ట్స్ అమ్మడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టిమ్ కుక్ స్పందించారు. యాపిల్ భారత్‌ను వదిలి వెళ్లడం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఐఫోన్ల తయారీని మరింత పెంచుతామని ప్రకటించారు. ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారత్‌లోనే ఉండబోతోందని తెలిపారు. ఐఫోన్ ప్రో మోడళ్లను కూడా తయారు చేస్తామంటూ టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫాక్స్‌కాన్ మొదలు పెట్టిందని టిమ్ కుక్ తెలిపారు.

Next Story