Petrol Price: రూ.55కే పెట్రోల్‌.. ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-01-11 11:41:37  IST  )

పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 100లకు పైగానే ఉంది. డీజిల్ ధర రూ. 100లోపు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ రాష్ట్ర సర్కార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం రూ. 55లకే లీటర్ పెట్రోల్, డీజిల్(Petrol Price) అందిస్తోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం.

Petrol Price: రూ.55కే పెట్రోల్‌.. ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) భారీగా పెరుగుతున్నాయి. గతంలో కేంద్రంలోని మోదీ సర్కార్( Modi Govt) వీటి ధరలు తగ్గించినప్పటికీ.. ఇంకా భారంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది. వాహనదారులకు అదిరిపోయే వార్త అందించింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది.

చంద్రబాబు సర్కార్ సబ్సిడీపై పెట్రోల్, డీజిల్(Petrol, diesel on subsidy) ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. లీటర్ పెట్రోల్, డీజిల్ కేవలం రూ. 55లకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు. కానీ ఈ సబ్సిడీ అందరికీ కాదు. కొందరికి మాత్రమే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులు(Disabled) మాత్రమే పొందగలరు. వీళ్లకు మాత్రమే తక్కువ ధరకే ఇంధనం వస్తుంది. అయితే తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం(Private job) చేసుకుంటున్నవారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయం(Welfare Department Office)లో అప్లయ్ చేసుకోవాలి. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి. మూడు చక్రాల మోటర్ రైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్(Subsidy Scheme) అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలో రూ. 26 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది.

సర్కార్ ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ సబ్సిడీపై కూడా కాలపరిమితి అనేది ఉంటుంది. టూ హెచ్ పి వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది.

ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే వారు పెట్రోల్, డీజిల్(Petrol Price) కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమవుతుంటాయి. మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ చివరి తేదీ అని అధికారులు ప్రకటించారు.

Next Story