- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ఎయిరిండియా విమానంలో ప్రమాదం.. గాల్లో ఉండగానే పొగలు!
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుసగా వార్తల్లో నిలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం (Ahmedabad plane crash) తర్వాత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సాంకేతిక లోపాల కారణంగా విమానాలు రద్దవ్వటం, మిడ్-ఎయిర్‌లో ఆటంకాలు ఎదురవ్వటం వంటి ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.. తాజాగా మరోసారి ఎయిరిండియా (Air India) విమానంలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. అయితే ఫైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ముంబై నుంచి చెన్నైకి జూన్ 28న ఎయిర్ ఇండియా AI639 విమానం బయలుదేరింది. అయితే విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, క్యాబిన్‌లో ఆకస్మికంగా మంటల వాసన (burning smell) రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని, వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకొని విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. మంటల వాసనకు గల కారణంపై ప్రస్తుతం సాంకేతిక బృందం పరిశీలన జరుపుతోంది. అయితే, వరుస ఘటనల నేపథ్యంలో ఎయిర్ ఇండియా భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక ఈ ఘటనపై ఎయిరి ఇండియ ప్రతినిధి స్పందిస్తూ.. 'విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. బదులుగా మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించాం. ముంబైలోని మా గ్రౌండ్ సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయాలను అందించారు. ఈ అనుకోని అసౌకర్యం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూసినందుకు కృషి చేశాం' అని పేర్కొన్నారు.






