Vantara: అనంత్ అంబానీ వంతారాకు బడ్జెట్ ఎఫెక్ట్

by S Gopi |

తాజా బడ్జెట్‌లో కేంద్రం జంతువులు, పక్షుల దిగుమతులపై 30 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది.

Vantara: అనంత్ అంబానీ వంతారాకు బడ్జెట్ ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రభావం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీపైనా పడింది. తాజా బడ్జెట్‌లో కేంద్రం జంతువులు, పక్షుల దిగుమతులపై 30 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. దీనివల్ల గుజరాత్‌లో దాదాపు 2,000 వణ్యప్రాణులకు నిలయంగా ఉన్న 3,500 ఎకరాల వంతారా జూపై ఆర్థిక భారం పడనుంది. అంబానీకి చెందిన ఈ వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం రిలయన్స్ దాతృత్వ విభాగం నిర్వహిస్తుంది. దేశంలోని అనేక జంతు ప్రదర్శనశాలల్లో ఏవీ, తరచుగా ప్రభుత్వ నిర్వహణలో, ఈ స్థాయిలో జంతువులను దిగుమతి చేసుకోవు. 2022 నుంచి ఈ జూ దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా వంటి దేశాల నుంచి చిరుతలు, ఖడ్గమృగాలు, అనేక సరీసృపాలను దిగుమతి చేసుకుంది. కానీ, ఇప్పటివరకు జంతువులు, పక్షుల దిగుమతులపై ఎలాంటి సుంకం లేదు. తాజాగా కస్టమ్స్ సుంకం విధించడంతో వంతారాతో పాటు వణ్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు ఆర్థిక భారం తప్పదు. అయితే, ఈ సుంకం విధించడానికి గల కారణాలు లేదా వివరణను ప్రభుత్వం ఇవ్వకపోవడం గమనార్హం.

Next Story