- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anil Ambani: బ్యాంకు మోసం వ్యవహారంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్‌పై సీబీఐ కేసు
నేరపూరిత కుట్ర, దుర్వినియోగం కారణంగా యూనియన్ బ్యాంకుకు రూ. 228.06 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఫిర్యాదులో పేర్కొంది

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్) తో ముడిపడి ఉన్న బ్యాంకింగ్ మోసం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనీల్ అంబానీపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. మోసం, నేరపూరిత కుట్ర, దుర్వినియోగం కారణంగా యూనియన్ బ్యాంకుకు రూ. 228.06 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఫిర్యాదులో పేర్కొంది. అధికారుల ప్రకారం, ఈ కేసులో ఆర్‌హెచ్ఎఫ్ఎల్ మాజీ సీఈఓ, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర సుధాకర్, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా ఉన్నాయి. జై అన్మోల్ అనిల్ అంబానీ, రవీంద్ర సుధాకర్, ఇతరులు రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించడంలో అవకతవకలు ద్వారా ఆర్థిక నష్టానికి కారణమయ్యారు. దీంతో మోసం, పదవి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కింద సీబీఐ ఈ కేసును చేపట్టింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అనుప్ వినాయక్ తరలే దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ముంబైలోని బ్రాంచ్ ద్వారా ఆర్‌హెచ్ఎఫ్ఎల్ 2015-2019 మధ్య రూ. 450 కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. కంపెనీ ఖాతాలపై ఓ ఆడిట్ సంస్థ జరిపిన పరిశీలనలో నిధులు మళ్లించినట్టు తేలింది. దీంతో బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.






