- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anant Ambani: అనంత్ అంబానీ జీతం రూ. 10-20 కోట్లు
అనంత్ అంబానీ కంపెనీ నికర లాభాల ఆధారంగా వేతనం పొందడానికి అర్హులని తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కమిషన్‌తో కలిపి రూ. 10-20 కోట్ల వరకు వార్షిక జీతం తీసుకుంటున్నారని కంపెనీ ఆదివారం తెలియజేసింది. ఇటీవలే రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులపైన అనంత్ అమబానీ ఐదేళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉంటారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ వేతన వివరాలను కంపెనీ వెల్లడించింది. జీతం, కమిషన్, అలవెన్సులు కలిపి అనంత్ అంబానీకి జీతం చెల్లించనున్నట్టు కంపెనీ తన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాకుండా అనంత్ అంబానీ కంపెనీ నికర లాభాల ఆధారంగా వేతనం పొందడానికి అర్హులని తెలిపింది. మొత్తం చెల్లింపులో వసతి, ప్రయాణాలు, మెడికల్ రియంబర్స్‌మెంట్‌తో పాటు సంస్థ తరపున భద్రతా సదుపాయాలు ఉంటాయి. కాగా, 2023లో వారసత్వ ప్రణాళికలో భాగంగా సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తన ముగ్గురు సంతానం ఈశా, ఆకాశ్, అనంత్‌లకు రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవుల్లో తీసుకున్నారు. ఈ పదవిలో ఉన్న సమయంలో వారికి ఎలాంటి జీతం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమావేశాలకు హాజరు అయినందుకు రూ. 4 లక్షల చొప్పున ఫీజు, సంస్థ లాభాలపై కమీషన్ రూపంలో రూ. 97 లక్షల చొప్పున పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అనంత్ అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు.






