రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ.. ఎన్నేళ్లు బాధ్యతలు చేపట్టనున్నారంటే..?

by Kodari Anjali |

ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ.. ఎన్నేళ్లు బాధ్యతలు చేపట్టనున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం అనంత్ అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌(Non-Executive Director)గా పనిచేస్తున్నారు. ఇప్పుడు RILలో నాయకత్వ బృందంలో భాగంగా కార్యనిర్వాహక బాధ్యతలను స్వీకరించేందుకు రెడీగా ఉన్నారు. 2035 నాటికి నికర-సున్నా కార్బన్ ఉద్గార సంస్థగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న రిలయన్స్‌లో అనంత్ సూపర్ యాక్టివ్, ప్రోయాక్టివ్‌గా ఉన్నారని తెలుస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) డైరెక్టర్ల బోర్డు శుక్రవారం నాడు అనంత్ ఎం. అంబానీని మే 1, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఐదు సంవత్సరాలు బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా అనంత్ అంబానీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story