Anant Ambani: కేరళలో ఆలయాలకు అనంత్ అంబానీ రూ. 18 కోట్ల భారీ విరాళం

by S Gopi |

ఈ రెండు ఆలయాలకు రూ. 3 కోట్ల చొప్పున మొత్తం రూ. 6 కోట్లు, అదనంగా మరో రూ. 12 కోట్ల విరాళం ఇచ్చారు.

Anant Ambani: కేరళలో ఆలయాలకు అనంత్ అంబానీ రూ. 18 కోట్ల భారీ విరాళం
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలోని ప్రముఖ ఆలయాలు రాజరాజేశ్వరమ్, గురువాయూర్ ఆలయాలకు భారీ విరాళం ప్రకటించారు. దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఈ రెండు ఆలయాలకు రూ. 3 కోట్ల చొప్పున మొత్తం రూ. 6 కోట్లు, అదనంగా మరో రూ. 12 కోట్ల విరాళం ఇచ్చారు. ఇటీవల తలిపరంబలో ఉన్న రాజరాజేశ్వరమ్ ఆలయాన్ని దర్శించిన అనంత్ అంబానీ, సంప్రదాయ పద్ధతిలో పొన్నుమ్కుడం, పట్టం, తాళి, నేయ్యామృతం సమర్పించి అశ్వమేధ నమస్కారం చేశారు. ఆ సందర్భంగా జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ. 3 కోట్లను ఆలయ అధికారులకు అందించారు. అంతేకాకుండా మెరుగైన పార్కింగ్, చారిత్రాత్మక తూర్పు గోపురం పునరుద్ధరణకు అదనంగా రూ. 12 కోట్లు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే, గురువాయూర్ ఆలయాన్ని కూడా సందర్శించిన అనంత్ అంబానీ, ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ట్రస్టుకు రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు. ఇదే సమయంలో ఆలయంలోని ఏనుగుల సంక్షేమం కోసం కూడా సాయం ఇవ్వనున్నట్టు చెప్పారు. వాటికి ఆధునిక మౌలిక సదుపాయాలు, షెల్టర్, ఏనుగుల ఆసుపత్రి వంటి బాధ్యతలను తీసుకోనున్నట్టు ప్రకటించారు.

Next Story