Ghibli image: జీబ్లీ స్టైల్ ఇమేజ్‌పై ఆనంద్ మహీంద్రా రియాక్షన్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-03 15:15:36  IST  )

ప్రస్తుతం 'జీబ్లీ' ట్రెండ్ నడుస్తోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్..

Ghibli image: జీబ్లీ స్టైల్ ఇమేజ్‌పై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం 'జీబ్లీ' ట్రెండ్ నడుస్తోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసిన ఈ జిబ్లీ స్టైల్ ఫొటోలే కనిపిస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఓపెన్‌ ఏఐ (Open AI) సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జీబ్లీ (Ghibli) స్టూడియోను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు తమకు నచ్చిన చిత్రాలకు యానిమేషన్‌ రూపం ఇస్తూ కార్టూన్‌ తరహా ఫొటోలుగా ఎడిట్ చేసుకుని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ స్టార్స్ ఫొటోస్ ఈ ట్రెండ్‌లో దర్శనమిచ్చాయి. తాజాగా ఓ యూజర్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra ) ఫొటోను జీబ్లీ స్టైల్‌లో క్రియేట్‌ చేసి 'ఎక్స్' వేదికగా షేర్ చేశాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా.. ఈ ఫొటోను చూసి ఆశ్చర్యపోయారు. ఆ పోస్టును రీపోస్టు చేస్తూ.. 'ఈ జీబ్లీ ఇమేజ్‌లను ఎలా రూపొందించాలో నేర్చుకోవాలి' అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారుతోంది.

Next Story