హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

by Disha Web Desk 17 |
హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ప్రకటించిన ఆనంద్ మహీంద్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఉన్నటుంటి మహీంద్రా విశ్వవిద్యాలయానికి రూ.500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలంలో తమ కుటుంబం నుంచి ఈ మొత్తాన్ని అందిస్తామని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ఏడాది రూ.100 కోట్లు, వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమ కేంద్రంగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

అలాగే, యూనివర్సిటీకి అనుబంధంగా తన తల్లి పేరు మీద ఉన్న ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం మరో రూ.50 కోట్లకు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని మే 2020లో స్థాపించారు. ప్రస్తుతం ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయిలలో ఐదు పాఠశాలలు, నాలుగు కేంద్రాలలో 35 ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌తో సహా రెండు అదనపు పాఠశాలలను 2024-25లో స్థాపించాలని భావిస్తున్నారు.


Next Story

Most Viewed