- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amul: పాల ధరలు తగ్గించిన అమూల్.. అన్ని రకాలపైన రూ.1 తగ్గింపు
మూడు రకాల పాల ఉత్పత్తులపైనా రూ. 1 చొప్పున తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ, అమూల్ బ్రాండ్‌ను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) పాల ధరలను తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అమూల్ బ్రాండ్ ద్వారా అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ రకాలను విక్రయిస్తోంది. కంపెనీకి చెందిన ఈ మూడు రకాల పాల ఉత్పత్తులపైనా రూ. 1 చొప్పున తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో సవరించిన ధరల ప్రకారం.. అమూల్ గోల్డ్ లీటర్ ధర రూ. 65కి చేరగా, అమూల్ తాజా లీటర్ రూ. 53, అమూల్ టీ స్పెషల్ ధర లీటర్ రూ. 61కి తగ్గనుంది. గతేడాది జూన్‌లో అన్ని రకాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజా ధరల తగ్గింపునకు సంబంధించి కారణాలపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. వినియోగదారులకు ప్రయోజనాలందించేందుకు తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని జీసీఎంఎంఎఫ్ ఎండీ జయేన్ మెహతా చెబుతున్నారు. డెయిరీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు, మార్కెట్ వాటాను కొనసాగించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.






