Amul Milk: పాల ధరలు పెంచిన అమూల్

by S Gopi |   (  Updated:2025-04-30 16:47:52  IST  )

దేశవ్యాప్తంగా ఒక్కో లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Amul Milk: పాల ధరలు పెంచిన అమూల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమూల్‌ పాల ధరలు పెరగనున్నాయి. అన్ని రకాల పాలపై ఈ పెంపు వర్తిస్తుందని అమూల్‌ బ్రాండ్‌ పేరున డెయిరీ ఉత్పత్తులను విక్రయించే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్) బుధవారం ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒక్కో లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు గురువారం(మే 1వ తేదీ) నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాల ఎంఆర్‌పీ ధరలో 3-4 శాతం మేరకు పెరుగుదలకు దారితీస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువ అని జీసీఎంఎంఎఫ్ తెలిపింది. అధికారిక ప్రకటన ప్రకారం, అర లీటర్ అమూల్ గోల్డ్ పాల ధర రూ. 34కి పెరగనుండగా, శక్తి వేరియంట్ పాలు అర లీటర్ రూ. 31కి లభిస్తుందని తెలిపింది.

Next Story