Amul Milk : అమూల్ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పాల ధరలు

by Muthe.Rajitha |

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అమూల్‌(Amul Milk) కీలక నిర్ణయం తీసుకుంది.

Amul Milk : అమూల్ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పాల ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అమూల్‌(Amul Milk) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా భారీగా పాల ధరలను తగ్గించింది. అమూల్‌ గోల్డ్‌, అమూల్‌ తాజా, అమూల్‌ టీ స్పెషల్‌ పాలపై రూ.1 చెప్పున తగ్గించినట్లు గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయేన్‌ మెహతా(Jayen Mehta) శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ తగ్గింపు లీటర్‌ ప్యాక్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. తాజా నిర్ణయంతో లీటర్‌ అమూల్‌ గోల్డ్‌ పాల ధర రూ.66 నుంచి రూ.65కి, అమూల్‌ టీ స్పెషల్‌ మిల్క్‌ లీటర్‌ ప్యాకెట్‌ ధర రూ.62 నుంచి రూ.61కి, అమూల్‌ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గింది. ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. కాగా, అమూల్‌ చివరిసారిగా గతేడాది జూన్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిన విషయం తెలిసిందే.

Next Story