Amazon: అమెజాన్‌లో 30,000 మంది తొలగింపు

by S Gopi |   (  Updated:2025-10-28 13:26:41  IST  )

కంపెనీ ఏకంగా 30,000 కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Amazon: అమెజాన్‌లో 30,000 మంది తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. ప్రధానంగా ఖర్చులను తగ్గించి, మహమ్మారి సమయంలో అధిక డిమాండ్ కారణంగా చేపట్టిన నియమకాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా కంపెనీ ఏకంగా 30,000 కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సంఖ్య 2022 ఆఖర్లో 27 వేల మందిని తొలగించిన తర్వాత అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం అమెజాన్‌లో ఉన్న 15.5 లక్షల ఉద్యోగుల్లో వీరి సంఖ్య తక్కువే. అయినప్పటికీ, తాజా లేఆఫ్స్ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 10 శాతానికి సమానం. అలాగే, కంపెనీలో ఇప్పుడు దాదాపు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. అమెజాన్ సంస్థ గడిచిన రెండేళ్ల కాలంగా కమ్యూనికేషన్స్, డివైజ్‌లు, పాడ్‌కాస్టింగ్ సహా ఇతర విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. తాజా తొలగింపులు హెచ్ఆర్ విభాగం, డివైజ్‌లు, సేవల విభాగాల్లో ఉండనున్నట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు. లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని, వచ్చే వారం సుమారు 1,000 మందికి నోటీసులు అందే ఛాన్స్ ఉన్నట్టు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

Read More... Amazon Layoff: 30 వేలు కాదు, ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ ప్రకటన

Next Story