Amazon : అమెజాన్ బంపర్ ఆఫర్.. ప్రైమ్ డే సేల్స్ తేదీలు అనౌన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-24 14:57:46  IST  )

అమెజాన్(Amezon) మరో బంపర్ ఆఫర్ తీసుకు వస్తోంది.

Amazon : అమెజాన్ బంపర్ ఆఫర్.. ప్రైమ్ డే సేల్స్ తేదీలు అనౌన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెజాన్(Amezon) మరో బంపర్ ఆఫర్ తీసుకు వస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రైమ్ డే 2025 సేల్స్(Amezon Prime Day Sale) ఈవెంట్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరగనుందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే వర్తించనుండగా, 124 దేశాల్లో అమలు కానుంది. ఇందులో సోనీ, డైసన్, కీహ్ల్స్, లెవీస్, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, కిచెన్, బ్యూటీ, అపారెల్, బ్యాక్-టు-స్కూల్ సప్లైస్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, బెస్ట్-సెల్లింగ్ టాయ్స్ వంటి 35 కంటే ఎక్కువ కేటగిరీలలో మిలియన్ల డీల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

“టుడేస్ బిగ్ డీల్స్” పేరుతో ప్రతి రోజు అర్ధరాత్రి PDT నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయని, 40% వరకు స్కూల్ సప్లైస్, 30% వరకు అమెజాన్ బ్రాండ్‌లపై డిస్కౌంట్లు ఉంటాయని పేర్కొంది. భారతదేశంలో ప్రైమ్ సభ్యులు సేల్‌లో 10 లక్షల పైగా ఉత్పత్తులపై అదే రోజు ఉచిత డెలివరీ, 40 లక్షల పైగా ఉత్పత్తులపై తదుపరి రోజు డెలివరీ, 20,000 పైగా ఉత్పత్తులపై 4 గంటల డెలివరీ పొందవచ్చని పేర్కొంది. గతేడాది ప్రైమ్ డేలో భారతదేశంలో రికార్డు సేల్స్, 200 మిలియన్ ఐటెమ్స్ అమ్ముడై, SMBలు నిమిషానికి 1600 యూనిట్లు విక్రయించాయని అమెజాన్ తెలియజేసింది.

Next Story