Amazon: వేర్‌హౌస్, డెలివరీ విస్తరణకు అమెజాన్ భారీ పెట్టుబడులు

by S Gopi |

కస్టమర్లకు మరింత వేగంగా, నమ్మకమైన డెలివరీ సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణల అభివృద్ధికి ఈ పెట్టుబడులు పనిచేస్తాయి.

Amazon: వేర్‌హౌస్, డెలివరీ విస్తరణకు అమెజాన్ భారీ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా దేశంలో నెట్‌వర్క్, వేర్‌హౌస్ విస్తరణతో పాటు ఈ ఏడాదిలోపు అప్‌గ్రేడ్ పనుల కోసం రూ. 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని గురువారం ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు మరింత వేగంగా, నమ్మకమైన డెలివరీ సేవలు అందించేందుకు, టెక్నాలజీ, ఆవిష్కరణల అభివృద్ధికి ఈ పెట్టుబడులు పనిచేస్తాయి. అంతేకాకుందా ఉద్యోగులు, అనుబంధ వ్యాపారుల శ్రేయస్సును మెరుగుపరిచేందుకు నిధులను ఉపయోగిస్తామని కంపెనీ పేర్కొంది. బ్రాండ్లకు పెరుగుతున్న ఆదరణ, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ చెల్లింపులు, సంపన్న-మధ్యతరగతి వర్గాల నుంచి పెరుగుతున్న ఖర్చులు, కొత్తగా పెరుగుతున్న జనరేషన్ కారణంగా దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ వృద్ధికి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్నట్టు అమెజాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పెట్టుబడులు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల పనితీరును వేగవంతం చేస్తుంది. డెలివరీ అసోసియేట్‌లు అతివేగంతో ప్రయాణించకుండా, వారికి తగిన విశ్రాంతి సమయాన్ని కల్పించడానికి, ఆన్-రోడ్ సేఫ్టీని పెంచేందుకు టెక్నాలజీ వాడకాన్ని పెంచుతుంది. వీటన్నింటితో పాటు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు అమెజాన్ సేవలను విస్తరించడం, అమ్మకందారులు, వృద్ధికి మద్దతిస్తుందని అమెజాన్ పేర్కొంది.

Next Story