- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon Pay: బయోమెట్రిక్ విధానంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభించిన అమెజాన్
ప్రతిసారి యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేయడానికి బదులుగా ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేమెంట్ విభాగం అమెజాన్ పే దేశీయ మార్కెట్లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ప్రతిసారి యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేయడానికి బదులుగా ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. దీనర్థం కస్టమర్లు తమ ఫోన్‌లోనే బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా డబ్బులు బదిలీ చేయడం, స్టోర్లలో చెల్లింపులు, అమెజాన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించి చెల్లింపులను వేగంగా, సురక్షితంగా చేయవచ్చని కంపెనీ తెలిపింది. లావాదేవీల కోసం పిన్ కోడ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. గతంలో, ఎవరైనా పిన్ నంబర్‌ను దొంగలిస్తే, బాధితుడికి తెలియకుండానే చెల్లింపులు చేసే అవకాశం ఉండేది. అయితే, అలాంటివి ఇకపై జరగవని వెల్లడించింది. ఫేస్, ఫింగర్‌ప్రింట్ ప్రామాణీకత సురక్షితమైన కీగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను వినియోగదారులు రూ. 5,000 వరకు లావాదేవీలనే చేయగలదని, అధిక లావాదేవీల కోసం కస్టమర్లు యూపీఐ పిన్ నంబర్‌నే ఉపయోగించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది.






