- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon India: జూలైలో ప్రారంభం కానున్న 'ప్రైమ్ డే ఈవెంట్'
ప్రైమ్ కస్టమర్ల కోసం బ్రాండ్లు, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూసే ప్రైమ్ డే ఈవెంట్‌ను జూలై నెలలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే నిర్వహించే ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు బ్యూటీ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపైనా భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. తొమ్మిదవ విడత ప్రైమ్ డే ఈవెంట్ జూలైలో ఉంటుంది. ప్రైమ్ కస్టమర్ల కోసం బ్రాండ్లు, ట్రెండింగ్‌లో ఉన్న ఉత్పత్తులు, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు కంపెనీ బుధవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం, దేశంలోని ప్రైమ్ సభ్యులు పది లక్షలకు పైగా ఉత్పత్తులపై అపరిమితంగా ఒక్కరోజులో డెలివరీ, 40 లక్షలకు పైగా వస్తువులను మరుసటి రోజు డెలివరీ, 20,000 కంటే ఎక్కువ ఉత్పత్తులపై అల్ట్రా-ఫాస్ట్ నాలుగు గంటల డెలివరీని అందిస్తున్నాం. ఈ సేల్‌లో పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై రాయితీ, వెల్‌కమ్ రివార్డులు, నాన్-ప్రైమ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకునేందుకు అవసరమైన ప్రయోజనాలు సహా పలు ఆఫర్లను ఇస్తామని కంపెనీ పేర్కొంది. గతేడాది జరిగిన ప్రైమ్ డే సందర్భంగా అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించామని, ఇప్పటివరకు అత్యధిక అమ్మకాలు, ఎక్కువ ఉత్పత్తులు అమ్ముడయ్యాయని అమెజాన్ ఇండియా వివరించింది.






