Amazon India: లాజిస్టిక్స్ విస్తరణ, ఉద్యోగుల కోసం అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడులు

by S Gopi |

వ్యాపార విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పనపై కూడా సంస్థ దృష్టి సారిస్తుంది.

Amazon India: లాజిస్టిక్స్ విస్తరణ, ఉద్యోగుల కోసం అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తన కార్యకలాపాల నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి రూ. 2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడి సంస్థ దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా, 2030 నాటికి దేశంలో 35 బిలియన్ డాలర్ల(రూ. 3.3 లక్షల కోట్ల)కు పైగా పెట్టుబడులు పెట్టాలన్న నిబద్ధతలో భాగమని తెలిపింది. వ్యాపార విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పనపై కూడా సంస్థ దృష్టి సారిస్తుంది. తాజా పెట్టుబడిని దేశంలోని వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూనే, సంస్థ ప్రధాన డెలివరీలతో పాటు క్విక్ కామర్స్ కార్యకలాపాలను విస్తరించడం కోసం వినియోగించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం కోసం ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ కింద మరిన్ని కార్యక్రమాలను విస్తరించడంతో పాటు, వైద్య, ప్రమాద బీమాను మెరుగుపరుస్తాం. దీని ద్వారా పదివేల మంది ఉద్యోగులు, 2 లక్షలకు పైగా కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందేలా వీలు కల్పిస్తామని పేర్కొంది.

Next Story