Amazon Sale: 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్ ఇండియా

by S Gopi |

ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న సబ్‌స్క్రైబర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లకు సంబంధించి యాక్సెస్ లభిస్తుందని వెల్లడించింది.

Amazon Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాదికి సంబంధించి తన అతిపెద్ద సేల్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2025' తేదీలను గురువారం ప్రకటించింది. ఇది ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని, ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న సబ్‌స్క్రైబర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లకు సంబంధించి యాక్సెస్ లభిస్తుందని వెల్లడించింది. ఈ సేల్ ఎప్పటివరకు ఉంటుందనే విషయాన్ని కంపెనీ పేర్కొనలేదు. ఈ సేల్ శాంసంగ్, యాపిల్, డెల్, ఆసుస్, రియల్‌మీ లాంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఏకంగా 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తామని పేర్కొంది. ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా ఆఫర్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఫోన్‌లతో పాటు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో హెడ్‌సెట్‌లపై అధిక డిస్కౌంట్‌లను పొందవచ్చు. రాయితీలే కాకుండా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని, వడ్డీలేని ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్ లాంటి ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయని అమెజాన్ వివరించింది. హెచ్‌పీ, బోట్, సోనీ వంటి బ్రాండ్‌ల నుంచి వివిధ ఎలక్ట్రానిక్స్, డివైజ్‌లపై 80 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు పేర్కొంది.

Next Story