- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: ఇరాన్ దాడులతో అమెజాన్ క్లౌడ్ యూనిట్లలో అంతరాయం
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ క్లౌడ్ యూనిట్లలో సమస్యలు తెలత్తాయని వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల్లో గందరగోళం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ క్లౌడ్ యూనిట్లలో సమస్యలు తెలత్తాయని వెల్లడించింది. ముఖ్యంగా బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అమెజాన్ క్లౌడ్ యూనిట్ డేటా సెంటర్లలో సోమవారం కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయని కంపెనీ తెలిపింది. ఇరాన్ దాడులు గల్ఫ్ వ్యాప్తంగా విమానాశ్రయాలు, ఓడరేవులు, నివాస ప్రాంతాలను తాకాయి. ఈ క్రమంలోనే తమ డేటా సెంటర్లను కూడా తాకడంతో మంటలు ఏర్పడ్డాయి. యూఏఈలోని క్లౌడ్ యూనిట్ ఏడబ్ల్యూఎస్ జోన్‌లలో ఒకదానికి పూర్తిగా విద్యుత్తు సౌకర్యం లేకుండా పోయింది. తర్వాత కొంత రికవరీ సాధించామని, అయినప్పటికీ అదనపు కనెక్టివిటీ సమస్యలు, ఎర్రర్ కొనసాగుతోందని అమెజాన్ వివరించింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నందున కస్టమర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. అలాగే, కంపెనీకి చెందిన బహ్రెయిన్ డేటా సెంటర్‌లో కూడా కనెక్టివిటీ సమస్యలు నెలకొన్నాయని సమాచారం. దీనిపై కంపెనీ స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.






