Amazon Bazaar: రిపబ్లిక్ డే సేల్‌లో భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్

by S Gopi |

రూ. 99 ప్రారంభ ధరలో లభించే వస్తువులపై అమెజాన్ బజార్­లో మొదటి ఆర్డర్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు

Amazon Bazaar: రిపబ్లిక్ డే సేల్‌లో భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల గ్రేట్ రిపబ్లిచ్ డే సేల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంస్థ అమెజాన్ బజార్ విభాగంలో కస్టమర్ల కోసం పెద్ద ఎత్తున ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు, ఇంకా అనేక విభాగాల్లో తక్కువ ధరలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కస్టమర్లు డీల్స్, కొన్ని రకాల ప్రీమియం ఉత్పత్తులపై 80 శాతం వరకు ఆఫర్లను, రూ. 500 వరకు క్యాష్­బ్యాక్­ పొందవచ్చని తెలిపింది. ముఖ్యంగా రూ. 99 ప్రారంభ ధరలో లభించే వస్తువులపై అమెజాన్ బజార్­లో మొదటి ఆర్డర్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇదే సమయంలో ప్రైమ్ మెంబర్లకు 5 శాతం క్యాష్­బ్యాక్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై నాన్-ప్రైమ్ మెంబర్లకు 3 శాతం, రూ. 2,500ల వరకు వెల్ గిఫ్ట్స్ సహా పేమెంట్, రివార్డులతో మరింత ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అర్హులైన కస్టమర్లు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్­ను కూడా యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యేకమైన షాపింగ్ రివార్డులను కూడా ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. రోజుకు రూ. 99 ఈఎంఐ ద్వారా అమెజాన్ బజార్ నుంచి మొబైళ్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఇతర పరికరాలను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లను కూడా లభిస్తుంది. అదనంగా క్యాష్­బ్యాక్, రివార్డ్స్ లభిస్తాయి. వాటిలో రూ. 799ల కన్నా ఎక్కువ ఆర్డర్లపై ప్రైమ్ మెంబర్లకు 5 శాతం తగ్గింపు, రూ. 499 కన్నా ఎక్కువ విలువ గల ఆర్డర్లపై అందరికీ 10 శాతం క్యాష్­బ్యాక్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, రివార్డులను అందిస్తున్నట్టు పేర్కొంది.

Next Story