అమెజాన్ నిర్ణయంతో భారీగా తగ్గిన 5G ఫోన్ల ధరలు

by Disha Web Desk 12 |
అమెజాన్ నిర్ణయంతో భారీగా తగ్గిన 5G ఫోన్ల ధరలు
X

ది, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ అయిన దిగ్గజ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సేల్స్‌ను పెంచుకొవాలనే ఆలోచనతో మెజాన్ 5జీ రివల్యూషన్ సేల్‌ను ప్రకటించింది. ఈ 5జీ రివల్యూషన్ సేల్‌ మే 27 నుంచి మే 31 వరకు మొత్తం నాలుగు రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్స్ కారణంగా 5G స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో OnePlus, realme, Samsung తో పాటుగా ఇతర 5జీ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు అభిస్తుంది. అలాగే అదనంగా కొనుగోలుదారులు నెలకు రూ. 1,666 నుండి ఉచిత EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. దీంతో పాటుగా తమ పాత ఫోన్లపై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.

లావా బ్లేజ్ 5G

ఈ లావా స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS డిస్‌ప్లే, ఆక్టా-కోర్ 2.2GHz మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ మరియు 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.

Redmi 11 Prime

MediaTek Helio G99 6nm Octa-core ప్రాసెసర్ Redmi 11 Primeకి శక్తినిస్తుంది. అమెజాన్‌లో దీని ధర 9,999గా ఉంది. 18W ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000mAh బ్యాటరీ, 90Hz FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

iQOO Z6 Lite 5G

స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.13,999 వస్తుంది. 5,000mAh బ్యాటరీ,120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది.

టెక్నో స్పార్క్ 10 5G

Tecno Spark 10 5G $14,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, 18W ఛార్జింగ్‌, 5000 mAh బ్యాటరీ, 2.2GHz వద్ద రన్ అయ్యే అద్భుతమైన టూ ఆర్మ్ కార్టెక్స్-A76 ద్వారా ఆధారితమైన 7nm డైమెన్సిటీ 6020 అనే ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Oppo A78 5G

Oppo A78 5G $18,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పరికరం యొక్క 5,000 mAh బ్యాటరీ 33W సూపర్ VOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 6.56-అంగుళాల 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది.

Also Read..

మొండి రుణాల నిర్వహణలో అత్యుత్తమ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర!



Next Story