ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్..నేడు బ్యాంక్ సేవలు దూరం !

by velandi.Saikiran |

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఇవాళ బ్రాంచ్‌ సేవలు దూరం కాబోతున్నాయి.

ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్..నేడు బ్యాంక్ సేవలు దూరం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఇవాళ బ్రాంచ్‌ సేవలు దూరం కాబోతున్నాయి. బ్యాంకులు ఓపెన్ గా ఉన్నప్పటికీ, ఖాతాదారులకు సంబంధించిన సేవలు మాత్రం నిలిపివేయనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సంబంధించిన పనులను బ్యాంక్ సిబ్బంది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కస్టమర్లకు ఈ రోజు బ్యాంకులు అందుబాటులో ఉండబోవు.

కానీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లాంటి సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కానీ బ్యాంక్ బ్రాంచీలలో నగదు జమ, విత్ డ్రాయల్ లాంటి సేవలు ఉండబోవు. ఇక ఏప్రిల్ 2వ తేదీన గురువారం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అటు ఏప్రిల్ మూడవ తేదీన గుడ్ ఫ్రైడే. ఆ రోజున మాత్రం మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ విష‌యాల‌ను గుర్తించి లావాదేవీలు చేసుకోవాల‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

Next Story