- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: దేశంలోనే మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్
మొట్టమొదటిసారి ఆల్-ఇన్-వన్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను మంగళవారం ప్రారంభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఓటీటీ ప్రియులకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఆల్-ఇన్-వన్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ ప్యాక్‌లో నెట్‌ఫ్లిక్స్, జియోసినిమా, జీ5, సోనీలివ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సహా 25కి పైగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఒకే రీఛార్జ్ ద్వారా యాక్సెస్ లభిస్తుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. సబ్‌స్క్రైబర్లు నెలకు రూ. 279 ప్రారంభ ధరతో ఈ ప్యాకేజీ పొందవచ్చు. ఈ ప్రారంభ ఓటీటీ ప్యాకేజీ ద్వారా రూ. 750 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 598, 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 1,729 ప్లాన్లు కూడా ఉన్నాయి. అన్ని ప్లాన్‌లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. దేశీయ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాన రిలయన్స్ జియోతో ధీటుగా మార్కెట్లో నిలబడేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్‌టెల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత వారమే గూగుల్ భాగస్వామ్యంలో పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ వన్ స్టోరేజ్ సేవలను ప్రారంభించింది.






