5G సేవల విస్తరణలో కీలక మైలురాయి చేరిన ఎయిర్‌టెల్!

by Disha Web Desk 17 |
5G సేవల విస్తరణలో కీలక మైలురాయి చేరిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల రెండు దిగ్గజ రిలయన్స్, ఎయిర్‌టెల్ కంపెనీలు 5జీ సేవల విభాగంలో ఫ్యామిలీ ప్లాన్‌లను పోటాపోటీగా ప్రకటించాయి. తాజాగా, ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ సేవలందించడంలో కీలక మైలురాయిని చేరుకుంది. కొత్తగా 235 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను అందించి మొత్తం 500 పట్టణాలకు 5జీ నెట్‌వర్క్ అందించిన కంపెనీగా నిలిచింది.

రిలయన్స్ ఇప్పటివరకు 406 పట్టణాల్లో తన సేవలను విస్తరించింది. తాము ఇప్పటికే 500 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందిస్తున్నాం. ప్రతిరోజు 30-40 నగరాలను 5జీ పరిధిలోకి తీసుకొస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని పట్టణాలన్నిటికీ విస్తరించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఎయిర్‌టెల్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ అన్నారు.

గతేడాది అక్టోబర్‌లో మొదటిసారిగా 5జీ సేవలను ప్రారంభించామని, ఏడాది కాలం పూర్తయ్యే లోగా దేశంలోని అన్ని పట్టణాలకు విస్తరిస్తామన్నారు. ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ 20 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు మెరుగైన వాయిస్ కాల్స్ అనుభవం పొందవచ్చని రణదీప్ పేర్కొన్నారు.


Next Story