Airtel: గూగుల్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌

by S Gopi |

ఈ స్టోరేజీని ఐదుగురితో మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

Airtel: గూగుల్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీ ఎయిర్‌టెల్, గూగుల్ టెలికాం కస్టమర్లకు గుడ్‌న్యూస్ ప్రకటించాయి. గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించాయి. ముఖ్యంగా వైఫై, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అదనంగా స్టోరేజీ సౌకర్యం అందించేందుకు గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఎయిర్‌టెల్ మంగళవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. గూగుల్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎయిర్‌టెల్ వైఫై, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు అదనంగా ఖర్చు చేయకుందా ఆరు నెలల కోసం 100జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ వినియోగించవచ్చు. కానీ, ఈ స్టోరేజీని ఐదుగురితో మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌తో లాగి-ఇన్ అవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఆరు నెలల తర్వాత స్టోరేజ్ కావాలంటే అదనంగా నెలకు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించకూడదని అనుకుంటే, వారు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ వదులుకుంటే సరిపోతుంది. స్టోరేజ్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాడుకోవచ్చు. గూగుల్ భాగస్వామ్యంతో కస్టమర్ల కోసం ఈ సదుపాయం అందించడం సంతోషంగా ఉందని ఎయిర్‌టెల్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ తెలిపారు.

Next Story