- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: గల్ఫ్ ఉద్రిక్తతలతో విమానాలను దారి మళ్లించిన ఎయిర్ఇండియా
ఇప్పటికే ఎయిర్ఇండియా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ మీదుగా విమానాలను పంపకుండా ఆపేసినట్టు పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటనలో, యూరప్, మిడిల్-ఈస్ట్, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు విమానాలను ఇతర మార్గాల్లో పంపిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఎయిర్ఇండియా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ మీదుగా విమానాలను పంపకుండా ఆపేసినట్టు పేర్కొంది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మీదుగా కూడా గగనతల మార్గాల్లో వెళ్లే విమానాలను ఇతర రూట్లకు మార్చడంతో యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్‌లకు వెళ్లే విమానాలకు ఎక్కువ సమయం పడుతుందని వివరించింది. దీనివల్ల యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యంగా గమ్యం చేరతాయని ఎయిర్ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇది ముందు జాగ్రత్త చర్య అని, భద్రతా సలహాదారులతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నామని, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని ఎయిర్ఇండియా వెల్లడించింది.






