- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: అంతర్జాతీయ రూట్లలో ఎయిర్ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్లు
ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో ఈ డిస్కౌంట్లు లభిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రయాణీకులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ఇటీవలే సీనియర్ సిటిజన్ల కోసం భారీ రాయితీలను ప్రకటించిన కంపెనీ, బుధవారం ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలను ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో ఈ డిస్కౌంట్లు లభిస్తాయని, తక్కువ ఖర్చుతో లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 2–7 తేదీల వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో (దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం) వర్తిస్తాయి. 2026, మార్చి 31లోపు చేసే ప్రయాణాలకు టికెట్లను డిస్కౌంట్‌తో బుక్ చేసుకునే వీలుంటుంది. ఎయిర్ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్‌తో పాటు ఎయిర్‌పోర్ట్ టికెట్ ఆఫీసులు, ట్రావెల్ ఏజెంట్ల నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆఖరి తేదీ అయిన సెప్టెంబర్ 7న కేవలం ఎయిర్ఇండియా వెబ్‌సైట్, యాప్ నుంచి మాత్రమే బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్ఇండియా ప్రీమియం ఎకానమీ రౌండ్ ట్రిప్ టికెట్ ధరను రూ. 13,300 నుంచి ప్రారంభం అవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు రూ. 34,400 నుంచి లభిస్తాయి. అదనంగా ఫ్లైఏఐ అనే ప్రోమో కోడ్ ద్వారా ఒక్కో టికెట్‌పై రూ. 2,400, వీసా కార్డుతో బుక్ చేసే సమయంలో వీసాఫ్లై కోడ్ ఉపయోగించి రూ. 2,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.






