Air India: 3 ఏళ్లలో 1,000 మందిని తొలగించిన ఎయిర్ఇండియా

by S Gopi |   (  Updated:2026-05-10 15:55:18  IST  )

గత మూడేళ్లలో వివిధ నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు.

Air India: 3 ఏళ్లలో 1,000 మందిని తొలగించిన ఎయిర్ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: నైతిక విలువలు పాటించని ఉద్యోగులపై ప్రముఖ విమానయాన ఎయిర్ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. సంస్థలో క్రమశిక్షణ, నైతిక ప్రమాణాల అమలుపై సంస్థ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇందులో భాగంగా గత మూడేళ్లలో వివిధ నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. విమానాల్లో వస్తువులను దొంగలించడం, అదనపు సామానును నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడం, ఎంప్లాయి ట్రావెల్ బెనిఫిట్లను దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై సంస్థ తీవ్ర చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో సిబ్బందికి ఈ విషయాన్ని స్పష్టం చేశారి. ముఖ్యంగా ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీని వందలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేశారన్నారు. ఇటువంటి చర్యలను అనుమతించేది లేదని, ఎవరూ చూడకపోయినా మనం నైతికంగానే ప్రవర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే 4,000 మందికి పైగా ఉద్యోగులపై విచారణ జరిపి, జరిమానాలు సహా దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంస్థలో వ్యయ నియంత్రణ చర్యల భాగంగా వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేయడం, అత్యవసరం కాని ఖర్చులను తగ్గించడం వంటి నిర్ణయాలను కూడా అమలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story