Air India: మే 7న ఎయిర్ఇండియా బోర్డు సమావేశం

by S Gopi |

ఖర్చు నియంత్రణ చర్యలు, కొత్త సీఈఓ ఎంపిక, అలాగే ఆర్థిక పరిస్థితిపై కీలక చర్చలు జరగనున్నాయి.

Air India: మే 7న ఎయిర్ఇండియా బోర్డు సమావేశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియాకు సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 7న ముంబైలో సంస్థ కీలక బోర్డు సమావేశం నిర్వహించనుంది. ఖర్చు నియంత్రణ చర్యలు, కొత్త సీఈఓ ఎంపిక, అలాగే ఆర్థిక పరిస్థితిపై కీలక చర్చలు జరగనున్నాయి. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం, సంస్థ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22,000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు అంచనా ఉండటం, అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం, కంపెనీపై ఒత్తిడిని మరింత పెంచాయి. ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఇప్పటికే రాజీనామా చేసిన నేపథ్యంలో బోర్డు సమావేశం జరుగుతుండటం పరిశ్రమ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా విమాన ఇంధన ధరలు(ఏటీఎఫ్) ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఖర్చులను తగ్గించేందుకు ఎయిర్ఇండియా టికెట్ ధరల్లో మీల్స్‌ను వేరు చేసింది, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లాంజ్ యాక్సెస్‌ను ఆప్షనల్‌కు మార్చడం, ఇంకా ఇతర చర్యలు ఉన్నాయి. వీటి గురించి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Next Story