అత్యధిక మహిళా పైలట్లతో ఏకైక విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా!

by Disha Web Desk 17 |
అత్యధిక మహిళా పైలట్లతో ఏకైక విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా!
X

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన 1,825 మంది పైలట్లలో 15 శాతం మంది మహిళా పైలట్లు ఉన్నారని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో మహిళా పైలట్లను కలిగిన ఏకైక విమానయాన సంస్థగా తాము అవతరించామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థలోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియాలలోని 90 కంటే ఎక్కువ విమానాలను మొత్తం మహిళలతోనే షెడ్యూల్ చేశామని, ఈ విమానాలను దేశీయ, అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్టు సంస్థ పేర్కొంది.

పూర్తిగా మహిళలతో నడుస్తున్న ఈ 90కి పైగా విమానాల్లో ఎయిర్ ఇండియా నుంచి 40, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గల్ఫ్ రూట్లో 10 అంతర్జాతీయ ఫ్లైట్లు, ఎయిర్ ఏషియా ఇండియాలోని 40కి పైగా విమానాలు దేశీయంగా ప్రయాణిస్తున్నాయి. అంతేకాకుండా ఎయిర్ ఇండియాలోని మొత్తం సిబ్బందిలో 40 శాతానికి పైగా మహిళలు ఉన్నారని, 1825 మంది పైలట్లలో 275 మంది అంటే 15 శాతం మహిళా పైలట్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా పైలట్లు దేశంలో ఉన్నారని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. ఇక, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియాలలోని మొత్తం సిబ్బందిలో మూడింట ఒక వంతు మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read..

మరికొంత కాలం స్టీల్ ధరలో హెచ్చుతగ్గులు తప్పవు: స్టీల్‌మింట్!

Next Story

Most Viewed